: సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే శరణ్యం: మంద కృష్ణ మాదిగ


సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే శరణ్యమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో రెండు రోజులపాటు జరిగిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించి ఆమోదించిన ఉద్యమకార్యాచరణ మంద కృష్ణ వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ, వికలాంగులు, వితంతువులు, వృద్దుల ఫించన్ల పెంపుపై పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా కిరణ్ కుమార్ రెడ్డి స్పందించలేదని, అందుకే అమీతుమీ తేల్చుకునేందుకు రంగం సిద్దం చేస్తున్నామన్నారు.

ఎస్సీ వర్గీకరణ, ప్రజాసమస్యలపై జూలై 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు అందోళనలు చేస్తామన్నారు. వికలాంగుల హక్కుల సాధనకు జూన్ 15 నుంచి 30 వరకు పోరుయాత్ర చేపడతామని మంద కృష్ణ తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు ఆగస్టులో ఉద్యమాలు చేపట్టి సెప్టెంబరు 15న మరో విశ్వరూప మహాసభ నిర్వహిస్తామన్నారు. తెల్లకార్డుల కోసం సెప్టెంబర్ 18 నుంచి నిరుపేదల ఆకలి కేకలు రధయాత్ర చేపడతామన్నారు.

  • Loading...

More Telugu News