ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ఎదుట విచారణకు హాజరైన సంతోష్ రావు

  • మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరైన సంతోష్ రావు
  • జూబ్లీహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్న అధికారులు
  • ఇప్పటికే కేటీఆర్, హరీశ్ రావును విచారించిన పోలీసులు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావు మంగళవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయంలో అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు.

సంతోష్ రావుకు నిన్న సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు మూడు గంటలకు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావులను ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారించారు.


More Telugu News