: యూడీఆర్ఎస్ కి భారత్ వ్యతిరేకం


యూడీఆర్ఎస్ (అంపైర్ నిర్ణయ సమీక్ష)విధానానికి భారత్ మద్దతు తెలపడం లేదు. క్రికెట్ లో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని పరిమితం చేయాలని ఇండియా బలంగా ఆకాంక్షిస్తోంది. అందుకనుగుణంగా పలు అంతర్జాతీయ వేదికలపై యూడీఆర్ఎస్ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా అంపైర్ నిర్ణయ సమీక్ష విధానానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వ్యతిరేకమని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. లండన్ లో జరిగే సమావేశాల్లోనూ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తామని ఆయన తెలిపారు. ఈ విధానాన్ని అవలంభిస్తే మైదానంలో అంపైర్ కేవలం ప్రేక్షకపాత్ర పోషించడానికి తప్ప ఇంకెందుకూ పనికి రాడని బీసీసీఐ వాదిస్తోంది. క్రికెట్లో అంపైర్ దే ప్రధానమైన పాత్ర అని దాన్ని మార్చడానికి పూనుకోవద్దంటూ డిమాండ్ చేస్తోంది. కేవలం భారత దేశం ఒక్కటే ఒప్పుకోని కారణంగా ఆ రూల్ అమలులోకి రావడం లేదు.

  • Loading...

More Telugu News