పవన్‌పై మరోసారి పూనమ్ కౌర్ ఫైర్... సోషల్ మీడియాలో దుమారం
- పవన్ కల్యాణ్‌పై నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు
- "మతమార్పిడులకు బ్రాండ్ అంబాసిడర్" అంటూ ఘాటు వ్యాఖ్య
- పవన్ వ్యక్తిగత జీవితం, పిల్లలను ఉద్దేశించి తీవ్ర విమర్శలు
- నాందేడ్ గురుద్వారా పర్యటన ఫొటోలతో మొదలైన వివాదం
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పూనమ్ ట్వీట్లు
ఒకప్పటి నటి పూనమ్ కౌర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మరోసారి తీవ్రమైన, సంచలన ఆరోపణలు చేశారు. గతంలో పరోక్షంగా విమర్శలు చేసే ఆమె, ఈసారి నేరుగా పవన్ వ్యక్తిగత జీవితాన్ని, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. పవన్ రాజకీయంగా కీలక పదవిలో ఉన్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే... ఆదివారం సాయంత్రం పవన్ కల్యాణ్ తన అర్ధాంగి అన్నా లెజినోవాతో కలిసి మహారాష్ట్రలోని నాందేడ్ గురుద్వారాను సందర్శించారు. అక్కడి శ్రీ గురు తేగ్ బహదూర్ షాహిది సమాగమంలో పాల్గొన్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలను జనసేన వీర మహిళా విభాగం అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది.
ఈ పోస్టుపై పూనమ్ కౌర్ స్పందించింది. ''తమ వారసత్వాలను మార్చుకుని, దుర్గుణాలను వదిలించుకునే వ్యక్తులు - మన ప్రియమైన గురువు పట్ల ఎటువంటి గౌరవాన్ని చూపించరు. గురు తేగ్ బహదూర్ జీ ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రతిదీ త్యాగం చేశారు. ఈ దుస్తులు, నకిలీ చిరునవ్వులు అధర్మాన్ని కప్పిపుచ్చడం తప్ప మరొకటి కాదు'' అని పూనమ్ ట్వీట్ చేశారు.
ఈ క్రమంలో ఓ నెటిజన్ పవన్ ఫొటోను పోస్ట్ చేస్తూ, ప్రాంతాల వారీగా విభజించే వారికి ఇది చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. ఈ పోస్టుకు పూనమ్ కౌర్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ను "మతమార్పిడులకు బ్రాండ్ అంబాసిడర్" అని అభివర్ణించారు. "తన వారసత్వాన్ని కాథలిక్ క్రైస్తవంలోకి మార్చిన వ్యక్తి, గురు తేగ్ బహదూర్ జీని ప్రార్థించవలసిన చివరి వ్యక్తి" అని ఆమె ఘాటుగా ట్వీట్ చేశారు.
పూనమ్ వ్యాఖ్యలపై మరో నెటిజన్ స్పందిస్తూ, భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేనని, పవన్ ఎవరినీ మతమార్పిడి చేయించలేదని, ఆయన పిల్లల్లో ఇద్దరు హిందువులేనని కౌంటర్ ఇచ్చారు. దీనికి పూనమ్ బదులిస్తూ మరింత తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణలు చేశారు. "అదే పిల్లలను మరొకరి కోసం ఎలాంటి కారణం లేకుండా వదిలేశాడు. ఆ పిల్లల తల్లిని అతని సోదరుడు వేధించాడు. సిగ్గుచేటు!" అంటూ ఆమె చేసిన పోస్ట్ కలకలం రేపింది.
గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై విమర్శలు చేసిన పూనమ్, ఇప్పుడు నేరుగా పవన్ ను ఉద్దేశించి వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.