పద్మ పురస్కారాల విజేతలకు వైఎస్ జగన్ అభినందనలు

  • పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం 
  • వివిధ రంగాల్లో వారు సాధించిన అత్యున్నత గుర్తింపు ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమన్న వైఎస్ జగన్
  • వారి సేవలు నిరంతరం కొనసాగించాలని ఆశిస్తున్నానన్న వైఎస్ జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పద్మ పురస్కారాల విజేతలకు అభినందనలు తెలిపారు. 2026 సంవత్సరానికి కేంద్రం ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించిన సందర్భంగా ఆయన స్పందిస్తూ, "తమ విశిష్ట సేవలతో దేశానికి, తెలుగు రాష్ట్రాలకు పేరు తెచ్చిన విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు. వివిధ రంగాల్లో మీరు సాధించిన అత్యున్నత గుర్తింపు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. మీ సేవలు నిరంతరం కొనసాగాలని ఆశిస్తున్నాను" అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందుగానే కేంద్రం పద్మ పురస్కారాల జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా జగన్ పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 13 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు లభించాయి. 


More Telugu News