: ఛలో అసెంబ్లీపై కేంద్రం కుతూహలం
ఛలో అసెంబ్లీ కార్యక్రమంపై కేంద్రం కుతూహలం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంపై అధిష్ఠానం ఆరా తీసింది. ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో ఈ అంశంపై చర్చించారు. కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ గులాంనబీ ఆజాద్ రాష్ట్రంలోని తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల తరువాత తెలంగాణపై మరోసారి కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని పలువురు నేతలు వ్యక్తం చేసారు. ప్రభుత్వం ఆందోళనకారులను సమర్ధవంతంగా అడ్డుకోవడంపై అధిష్ఠానం పెద్దలు హర్షం వ్యక్తం చేసారు. కేంద్రం నుంచి బలగాలను పంపినందుకు షిండేకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.