: ఛలో అసెంబ్లీ సందర్భంగా 700 మంది అరెస్ట్


ఛలో అసెంబ్లీ నేపథ్యంలో 700 మందిని అరెస్టు చేసినట్టు నగర కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. హైదరాబాద్ లో ఈ సాయంత్రం ఆయన మాట్లాడుతూ అరెస్టయిన వారిలో 45 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారన్నారు. చిన్నచిన్న ఘటనలు మినహా ఛలో అసెంబ్లీ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. అయితే ఓయూలో భాష్పవాయు షెల్ తగిలి ఓ విద్యార్థి గాయపడ్డాడని తెలిపారు. కాగా మరో వైపు సైబరాబాద్ పరిథిలో 40 కేసులు నమోదుకాగా, మరో 476 మందిని అరెస్టు చేసారు. అయితే సైబరాబాద్ పరిథిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు చేపట్టినట్టు వివరించారు.

  • Loading...

More Telugu News