ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హరీశ్ రావుకు నోటీసులు
- రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు
- జూబ్లీహిల్స్‌లోని పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలన్న సిట్
- ప్రస్తుతం సిద్దిపేట పర్యటనలో ఉన్న హరీశ్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు (మంగళవారం) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌లోని పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం హాజరు కావాలని సిట్ హరీశ్ రావుకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. మాజీ మంత్రి ప్రస్తుతం సిద్దిపేట పర్యటనలో ఉన్నారు. ఆయన ఇంట్లో లేని సమయంలో సిట్ ఈ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చిన దర్యాప్తు బృందం వారిని విచారించింది.