: ఫాం హౌస్ లో కూర్చుని బంద్ ప్రకటనలా?: కేసీఆర్ పై ఎర్రబెల్లి ఆగ్రహం
టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావుపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు నిప్పులు చెరిగారు. ఫాం హౌస్ లో కూర్చుని బంద్ ప్రకటనలు చేయడం సరికాదని హితవు పలికారు. ఇతర పార్టీలను సంప్రదించకుండా తానొక్కడే బంద్ కు ఎలా పిలుపునిస్తాడని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఖండిస్తున్నామని ప్రకటించారు. హైదరాబాద్ లో ఈ సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ, రేపటి బంద్ విషయంలో టీడీపీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు.
ఉద్యమంలో పాల్గొనకుండా ఎక్కడో కూర్చుని ప్రకటనలు చేసే కేసీఆర్ కు తెలంగాణ రాజకీయ జేఏసీ తోకలా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. న్యాయవాదుల ముసుగులో టీడీపీ నేతలపై దాడులు చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు.