ఫైర్ మీదున్నా... నిశ్శబ్దంగా పనిచేస్తున్నా!: రామ్ చరణ్
- 'పెద్ది' సినిమా కోసం కసరత్తులు మొదలుపెట్టిన రామ్ చరణ్
- తాజాగా రామ్ చరణ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
- ఇటీవలే విజయవంతంగా పూర్తయిన ఢిల్లీ షెడ్యూల్
- శరవేగంగా షూటింగ్.. మార్చి 27న పాన్ ఇండియా రిలీజ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తర్వాతి సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్ డ్రామా 'పెద్ది' కోసం ఆయన కఠినంగా కసరత్తులు చేస్తున్నారు. తాజాగా జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫొటోలను పంచుకున్న చరణ్.. "ఫైర్ మీదున్నా... నిశ్శబ్దంగా పనిచేస్తున్నా!!! తర్వాతి సవాల్‌కు సిద్ధం" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సినిమా షూటింగ్ అత్యంత వేగంగా జరుగుతోంది. గతేడాది డిసెంబర్‌లో ఢిల్లీ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఆ షెడ్యూల్‌లో రామ్ చరణ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ప్రశంసించారు. ఈ నెలాఖరు నాటికి సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్‌లో, ప్రముఖ స్టంట్ మాస్టర్ శామ్ కౌశల్ ఆధ్వర్యంలో ఓ కీలకమైన ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఇందులో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.