25 ఏళ్లు కష్టపడి చదివితే 75 ఏళ్ల వరకు గౌరవంగా జీవించవచ్చు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- తొలి ప్రధాని నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు, విద్యకు ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడి
- తమ ప్రభుత్వం కూడా వాటికే ప్రాధాన్యత ఇస్తోందన్న ముఖ్యమంత్రి
- విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందన్న ముఖ్యమంత్రి
25 ఏళ్లు కష్టపడి చదివితే 75 ఏళ్ల వరకు గౌరవంగా జీవించవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, చిట్టబోయినపల్లి ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలి ప్రధానమంత్రి నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు, విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు.
తమ ప్రభుత్వం కూడా వాటికే ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులే నేటికీ జీవనాధారంగా నిలుస్తున్నాయని అన్నారు. భూగరిష్ఠ పరిమితి చట్టం తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ దొరల వద్ద ఉన్న లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంచిందని గుర్తు చేశారు. విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని గుర్తించాలని సూచించారు. నిబద్ధత లేని చదువు వల్ల ప్రయోజనం ఉండదని అన్నారు.