పురుషులకు ఉచిత సిటీ బస్సు ప్రయాణం... ఎన్నికల హామీలను ప్రకటించిన అన్నాడీఎంకే

  • ఐదు ఎన్నికల హామీలను ప్రకటించిన పళనిస్వామి
  • కుటుంబంలో మహిళా యజమానికి నెలకు రూ. 2 వేలు
  • పేదలకు ఇళ్లు కేటాయిస్తామని హామీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి అన్నాడీఎంకే ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ 109వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి... ఐదు ప్రధాన హామీలను ప్రకటించారు. 


వీటిలో పురుషులకు ఉచిత సిటీ బస్సు ప్రయాణం, ప్రతి కుటుంబ మహిళకు నెలకు రూ. 2,000 జమ చేసే ‘మగళీర్ కులవిళక్కు’ పథకం, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు మరియు పట్టణాల్లో అపార్ట్ మెంట్ల పంపిణీ, ఎస్సీ జంటలకు ప్రత్యేక ఇళ్ల స్థలాల కేటాయింపు, అలాగే 5 లక్షల మహిళలకు ద్విచక్ర వాహనాల కొరకు రూ. 25,000 సబ్సిడీగా ‘అమ్మ టూ వీలర్ స్కీమ్’ ఉన్నాయి.


గత ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను డీఎంకే కాపీ కొట్టిందని పళనిస్వామి విమర్శించారు. గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నడిపినట్లు చెప్పారు. కరోనా సమయంలో కూడా ప్రజలకు అన్ని పథకాలను సక్రమంగా అందించామని తెలిపారు. 


More Telugu News