మహిళ అందంగా ఉంటే పురుషుడు చలిస్తాడు.. అందుకే వారిపై అత్యాచారం: కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
- సమాజంలో కొన్ని కులాలు, వర్గాల మహిళలపై లైంగిక దాడి జరుగుతోందని విమర్శ
- తీర్థయాత్రలకు వెళ్ళిన ఫలితం ఉంటుందనే అత్యాచారం చేస్తారని వ్యాఖ్య
- ఎమ్మెల్యే పూల్ సింగ్ వ్యవహారంపై మధ్యప్రదేశ్‌లో రాజకీయ దుమారం
మధ్యప్రదేశ్‌లోని భండేర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు పూల్ సింగ్ బరయ్య మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలకు కులాన్ని అంటగడుతూ జుగుప్సాకర రీతిలో మాట్లాడారు. ఈ సమాజంలో కొన్ని కులాలు, వర్గాల మహిళలపై లైంగిక దాడి జరుగుతోందని ఆయన అన్నారు. వారితో లైంగిక వాంఛ తీర్చుకుంటే తీర్థయాత్రలకు వెళ్లిన పుణ్యం దక్కుతుందనే నమ్మకంతో ఇలా చేస్తారని, దీనికి సంబంధించి పుస్తకాల్లో కూడా ఉందని పేర్కొన్నారు.
అందమైన అమ్మాయి కనిపిస్తే పురుషుడి మనస్సు చలించి అత్యాచారానికి పాల్పడే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని వర్గాల మహిళలు అందంగా ఉండరని, కానీ ఫలానా వర్గానికి చెందిన మహిళతో కలిస్తే ఏదో లాభం ఉంటుందని ఆశించి అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. రోడ్డుపై నడుస్తుంటే అందమైన అమ్మాయిని చూస్తే అది అతడి మనసును మరల్చి, అత్యాచారానికి ప్రేరేపిస్తుందని అన్నారు.
ఎమ్మెల్యే పూల్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ, వివిధ కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సిద్ధాంతం ఇదేనా అని బీజేపీ ప్రశ్నించింది. ఆయన ఎలాంటి నీచబుద్ధితో ఉన్నారో ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందని ఆల్ ఇండియా బ్రాహ్మణ పరిషత్ నేత పండిత్ పుష్పేంద్ర మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూల్ సింగ్ బరయ్య వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారి స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన వ్యాఖ్యలతో సంబంధం లేదని అన్నారు. అత్యాచారాన్ని ఏ విధంగానూ సమర్థించలేమని అన్నారు. అత్యాచారం చేసే వ్యక్తి ఎవరైనా కులం, మతంతో సంబంధం లేకుండా నేరస్థుడే అని ఆయన స్పష్టం చేశారు.