కరూర్ తొక్కిసలాట... హీరో విజయ్‌కు మరోసారి నోటీసులు జారీ చేసిన సీబీఐ
- నిన్న ఆరు గంటలకు పైగా విచారించిన సీబీఐ
- తాజాగా మరోసారి నోటీసులు జారీ
- జనవరి 19న విచారణకు హాజరు కావాలని సూచన
కరూర్ తొక్కిసలాట కేసులో ప్రముఖ సినీ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్‌కి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. నిన్న సీబీఐ ఆయన్ని ఆరు గంటలకు పైగా ప్రశ్నించింది. మొదటిరోజు విచారణ సమయంలోనే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సీబీఐ పేర్కొనగా, పొంగల్ సందర్భంగా ఆయన విరామం కోరారు.
ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ తర్వాత విచారణకు రావాలని సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 19న విచారణకు హాజరు కావాలని సూచించింది. గత ఏడాది సెప్టెంబర్ 27న విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా, ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే.