: పంట నష్టంపై రేపు సీఎం సమీక్ష
గత రెండు రోజులుగా కురిసిన వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది హెక్టార్లలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో ఢిల్లీ నుంచి రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి చర్యలకు ఉపక్రమించారు. పంట నష్టంపై ప్రాథమిక నివేదికలను పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.
రేపు పంట నష్టంపై సీఎం అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మెదక్, కరీంనగర్ జిల్లాలలో పర్యటించి పరిస్థితిని అంచనా వేయాలని మంత్రులు గీతారెడ్డి, శ్రీధర్ బాబును ఆదేశించారు.
రేపు పంట నష్టంపై సీఎం అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మెదక్, కరీంనగర్ జిల్లాలలో పర్యటించి పరిస్థితిని అంచనా వేయాలని మంత్రులు గీతారెడ్డి, శ్రీధర్ బాబును ఆదేశించారు.
అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి దామోదర నరసింహతో కలిసి రాజమండ్రి పర్యటనకు బయల్దేరి వెళ్లారు.