టాలీవుడ్ లో ఈ హీరోపైనే నా క్రష్: మాళవిక మోహనన్

  • 'ది రాజా సాబ్'లో ప్రభాస్ సరసన నటిస్తున్న మాళవిక
  • 'బాహుబలి' చూసినప్పటి నుంచి ప్రభాస్ తన క్రష్ అని వెల్లడి
  • 'సలార్'లో ప్రభాస్ సరసన అవకాశం మిస్ అయ్యానన్న బ్యూటీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'ది రాజా సాబ్' సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ చిత్రం జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండగా, వారిలో ఒకరైన మాళవిక మోహనన్ తన తాజా ఇంటర్వ్యూలో ఆసక్తిర విషయాలను పంచుకున్నారు.


ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో భాగంగా మాళవిక మోహనన్ ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'బాహుబలి' సినిమా చూసిన తర్వాత నుంచీ ప్రభాస్ తనకు క్రష్ అని, ఆయనతో కలిసి నటించడం తన కల నెరవేరినట్లు ఉందని వెల్లడించారు. గతంలో 'సలార్' సినిమాలో నటించే అవకాశం మిస్ అయినా, ఇప్పుడు 'ది రాజా సాబ్'తో ఆ కల నెరవేరిందని, ఇదంతా విధి అని ఆమె అన్నారు.


షూటింగ్ సమయంలో ప్రభాస్ ప్రవర్తన చాలా బాగుందని, ఆయన చాలా మధురమైన వ్యక్తి అని మాళవిక పొగడ్తలు కురిపించారు. అంతేకాదు, హైదరాబాద్ బిర్యానీని కూడా తనకు తినిపించారని సరదాగా చెప్పుకొచ్చారు. మాళవిక చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.


ఈ చిత్రంలో మాళవికతో పాటు నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కూడా హీరోయిన్లుగా పాత్రల్లో కనిపించనున్నారు. సంజయ్ డత్, బోమన్ ఇరానీ వంటి బాలీవుడ్ నటులు కూడా నటిస్తోన్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది.



More Telugu News