: షట్లర్ అజయ్ జయరాం ఇంటిముఖం
ఇండోనేషియా బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో అజయ్ జయరాం ఓటమిపాలయ్యాడు. లీగ్ దశలో తిరుగులేని ఆటతీరుతో ఆకట్టుకున్న అజయ్ క్వార్టర్స్ లో జర్మనీ షట్లర్ ధాటికి చేతులెత్తేశాడు. మర్కజ్వబలర్ చేతిలో 21-16, 21-15 తేడాతో అజయ్ జయరాం ఓటమిపాలయ్యాడు. దీంతో ఇండోనేషియా ఓపెన్ లో భారత జైత్రయాత్రకు అడ్డుపడింది. మిగిలిన భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఆకట్టుకుంటున్నారు.