: 'నేతల హడావుడే తప్ప ప్రజల స్పందనేది?'
ఛలో అసెంబ్లీకి నేతల హడావుడే తప్ప ప్రజల స్పందన లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని తెలంగాణ బంద్ కు పిలుపునిస్తే ప్రజలు స్పందించరని అన్నారు. ఛలో అసెంబ్లీలో నేతలు పాల్గొన్నారే కానీ ప్రజలు పాల్గోలేదని తెలిపారు.