: వరుణుడా మజాకా!
తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాల ధాటికి జనజీవనం స్థంభించిపోయిది.భారీ వర్షాలతో సుమారు 70 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో పలు ప్రాంతాలకు బస్సు సర్వీసులను రద్దు చేశారు. కాగజ్ నగర్ మండలంలో 14.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాకిండి మండలంలో ఎడతెరిపిలేని వానలతో విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. బెజ్జూరు మండలం కుషాన్ పల్లిపెద్దవాగు పొంగడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. సారంగపూర్ మండలం వంజర్ గ్రామం వద్ద నీటిప్రవాహ ఉధ్రుతికి రోడ్లు తెగిపోయి రాకపోకలు స్థంభించాయి. మరో వైపు కరీంనగర్ జిల్లాలో కురుస్తున్న వర్షాల ధాటికి బొగ్గు ఎగుమతులు కూడా నిలిచిపోయాయి.