భారీగా తగ్గిన బంగారం ధరలు
- రెండు రోజుల్లోనే ఏకంగా రూ.6వేలు తగ్గిన బంగారం ధరలు
- విజయవాడ, హైదరాబాద్ మార్కెట్‌లలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,36,200లకు చేరిన వైనం
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,850లకు తగ్గిన వైనం
గత కొద్ది రోజులుగా శరవేగంగా పెరుగుతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా అడ్డుకట్ట పడింది. పసిడి ధరలు కేవలం రెండు రోజుల్లోనే దాదాపు రూ.6,000 వరకు దిగిరావడంతో స్వర్ణ మార్కెట్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలను పరిశీలిస్తే...
విజయవాడ, హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబై నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రెండు రోజుల్లో రూ.6,220 తగ్గి ప్రస్తుతం రూ.1,36,200 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.5,700 తగ్గడంతో 10 గ్రాముల రేటు రూ.1,24,850కి చేరింది.
ఢిల్లీ నగరంలో బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల ధరలకు దగ్గరగా ఉన్నప్పటికీ, స్వల్ప వ్యత్యాసం కనిపిస్తోంది. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,350గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,25,000 వద్ద ఉంది.
చెన్నై నగరంలో కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. రెండు రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.5,450 తగ్గడంతో 10 గ్రాముల రేటు రూ.1,37,460గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.5,000 వరకు తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.1,26,000గా కొనసాగుతోంది.