ఓటీటీ తెరపైకి 'మోగ్లీ'
- ఈ నెల 13న విడుదలైన సినిమా
- రోషన్ కనకాల నుంచి వచ్చిన రెండో సినిమా
- విలేజ్ నేపథ్యంలో సాగే ప్రేమకథ
- జనవరి 1 నుంచి 'ఈటీవీ విన్' లో
రోషన్ కనకాల హీరోగా వరుస సినిమాలు చేసే ఉద్దేశంతో కనిపిస్తున్నాడు. ఫస్టు మూవీతోనే నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన రోషన్, ఇప్పుడు తన రెండో సినిమాతో ఆడియన్స్ ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమానే 'మోగ్లీ'. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు.
కాలభైరవ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ నెల 13వ తేదీన థియేటర్లకు వచ్చింది. థియేటర్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకున్న ఈ సినిమా, నెల తిరక్కుండానే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను 'ఈటీవీ విన్' వారు దక్కించుకున్నారు. జనవరి 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా అధికారిక ప్రకటన చేశారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే, 'పార్వతీపురం' అనే ఒక మారుమూల గ్రామంలో 'మోగ్లీ' నివసిస్తూ ఉంటాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన మోగ్లీ, అందరూ తనవాళ్లే అనే ఉద్దేశంతో కలిసిపోయి బ్రతుకుతుంటాడు. అలాంటి అతను ఆ ఊరికి కొత్తగా వచ్చిన 'వర్ష'ప్రేమలో పడతాడు. అక్కడి నుంచే అతనికి కష్టాలు మొదలవుతాయి. వాటిని ఆయన ఎలా అధిగమించాడు? అనేదే కథ.