కాలేజీ విద్యార్థులు బెట్టింగ్ వేసుకుని మరీ బాలకృష్ణ సినిమాలు చూస్తున్నారు: బండి సంజయ్

  • సీనియర్ ఎన్టీఆర్‌ను మరిపించేలా బాలకృష్ణ నటన ఉందన్న బండి సంజయ్
  • బాలకృష్ణను చూస్తే పరమేశ్వరుడే ప్రత్యక్షమయ్యాడనిపించిందని వ్యాఖ్య
  • బోయపాటి శ్రీను సమాజానికి ఉపయోగపడే చిత్రాలు చేస్తుంటారన్న బండి సంజయ్
బాలకృష్ణ సినిమాలను నేడు కాలేజీ విద్యార్థులు సైతం బెట్టింగ్‌లు వేసి చూస్తున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఆయన అఖండ-2 సినిమా వీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, బాలకృష్ణ నటన సీనియర్ ఎన్టీఆర్‌ను గుర్తుకు తెచ్చేలా ఉందని అన్నారు.

బాలకృష్ణలో సీనియర్ ఎన్టీఆర్‌ను చూసుకుంటున్నామని ఆయన అన్నారు. అఖండ-2 సినిమాలో బాలకృష్ణను చూస్తే పరమేశ్వరుడే సాక్షాత్కరించినట్లు అనిపించిందని తెలిపారు. ఈ చిత్రం చూసి ఎంతో సంతోషించానని అన్నారు. బోయపాటి శ్రీను సంచలనాలకు మారుపేరని, ఆయన ఏ సినిమా చేసినా సమాజానికి ఉపయోగపడేలా ఉంటుందని కొనియాడారు.

పరమేశ్వరుడు బోయపాటిలో ఆవహించి ఈ సినిమాను తీయించి ఉంటారని సంజయ్ అన్నారు. అఖండ-2 సినిమా చూసిన తర్వాత, ఇన్నాళ్లు తన జీవితాన్ని, సమయాన్ని వృథా చేసుకున్నానని అనిపించిందని తెలిపారు. ఇప్పటికైనా మిగిలిన జీవితాన్ని దేశం కోసం, ధర్మం కోసం అంకితం చేయాలని ఆలోచన కలిగించే చిత్రమిదని ఆయన అన్నారు.


More Telugu News