తనను పెళ్లి చేసుకుని కశ్మీర్‌ను కట్నంగా ఇవ్వమని అడిగిన పాక్ మహిళ.. వాజ్‌పేయి ఏం సమాధానం చెప్పారంటే?

  • నేడు వాజ్‌పేయి 101వ జయంతి
  • ఢిల్లీలో ఏర్పాటు చేసిన వాజ్‌పేయి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్
  • తనను పెళ్లి చేసుకుని, కశ్మీర్‌ను ఇవ్వాలని కోరిన పాకిస్థాన్ మహిళ
  • పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే కానీ పాకిస్థాన్ కావాలని నోరు మూయించిన వాజ్‌పేయి
నేడు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వాజ్‌పేయికి సంబంధించిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. పాకిస్థాన్ మహిళ నుంచి ఊహించని ప్రతిపాదన ఎదురుకాగా, ఆయన చెప్పిన సమాధానం ఆమె నోరు మూయించిందని తెలిపారు.

వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకసారి వాజ్‌పేయి పాకిస్థాన్ పర్యటనకు వెళ్లారని, ఆయన ప్రసంగాలకు ఒక మహిళ ఆకర్షితురాలైందని తెలిపారు. వెంటనే వాజ్‌పేయి వద్దకు వచ్చి 'నన్ను పెళ్లి చేసుకుంటారా? అందుకు బదులుగా కశ్మీర్‌ను ఇస్తారా?' అని అడిగిందని, దానికి వాజ్‌పేయి ఇచ్చిన సమాధానం ఆమెను షాక్‌కు గురి చేసిందని అన్నారు.

"నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే, కానీ కట్నం కింద పాకిస్థాన్ కావాలి" అని వాజ్‌పేయి సమాధానం చెప్పారని, ఆయన వాక్చాతుర్యానికి ఆశ్చర్యపోవడం ఆమె వంతయిందని గుర్తు చేసుకున్నారు.

వాజ్‌పేయి చాలా అద్భుతంగా ప్రసంగించేవారని, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసేటప్పుడు ఎన్నడూ గీత దాటకుండా వ్యవహరించేవారని అన్నారు. బీజేపీ విస్తరణను చూసి ఆయన ఎంతగానో మురిసిపోయారని తెలిపారు. బీజేపీ ఎదుగుతున్న కొద్దీ, తన కుటుంబం పెద్దవుతోందని ఆనందం వ్యక్తం చేసేవారని అన్నారు.


More Telugu News