రోహిత్ భాయ్ వడాపావ్ తింటావా?.. విజయ్ హజారే మ్యాచ్‌లో ఫన్నీ మూమెంట్.. ఇదిగో వీడియో!
- విజయ్ హజారే ట్రోఫీలో సిక్కిం-ముంబై మ్యాచ్‌లో సరదా సంఘటన
- అభిమానితో రోహిత్ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్
- వడా పావ్ తింటావా అని అడగ్గా వద్దంటూ హిట్‌మ్యాన్ సైగ
- రోహిత్ మెరుపులతో సిక్కింపై ముంబై ఘన విజయం
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ సరదా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబై, సిక్కిం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా స్టాండ్స్‌లోని ఓ అభిమాని రోహిత్‌ను ఉద్దేశించి "రోహిత్ భాయ్ వడా పావ్ తింటావా?" అని గట్టిగా అడిగాడు. దీనికి రోహిత్ నవ్వుతూ వద్దంటూ చేతితో సైగ చేశాడు. ఈ దృశ్యం కెమెరాలో రికార్డ్ అవ్వడం, అది కాస్తా బయటకు రావడంతో కొద్దిసేపటికే నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, చాలా కాలం తర్వాత లిస్ట్-ఏ క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన రోహిత్ శర్మ తనదైన శైలిలో విధ్వంసక సెంచరీతో చెలరేగాడు. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సిక్కిం బౌలింగ్‌ను ఉతికారేశాడు. కేవలం 94 బంతుల్లో 18 ఫోర్లు, 9 భారీ సిక్సర్ల సాయంతో 155 పరుగులు సాధించి అభిమానులను అలరించాడు.
రోహిత్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా సిక్కిం నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు కేవలం 30.3 ఓవర్లలోనే ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు సుమారు 20,000 మంది అభిమానులు హాజరయ్యారు. రోహిత్ అద్భుత ప్రదర్శనతో పాటు అభిమానితో అతని సరదా సంభాషణ కూడా అందరినీ ఆకట్టుకుంది.