: బాలీవుడ్ చిత్రాలపై పాక్ 'పన్ను'పోటు


తమ దేశంలోకి కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతోన్న బాలీవుడ్ చిత్రాలపై 'సర్దుబాటు పన్ను' విధించాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. తాజా ప్రతిపాదనలను అనుసరించి.. సినిమా అయితే రూ. 10 లక్షలు, సీరియల్ అయితే ఎపిసోడ్ కు రూ. 1 లక్ష వంతున పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. 2013-14 ఆర్ధిక సంవత్సరానికి గాను పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెడుతూ పాకిస్తాన్ ఆర్ధిక మంత్రి ఇషాక్ దార్ పన్ను వివరాలను ప్రకటించారు. ఈ పన్ను అన్ని విదేశీ చిత్రాలు, విదేశీ సీరియళ్ళకు వర్తిస్తుందని ఆయన వెల్లడించారు.

1965లో భారత్ తో యుద్ధం తర్వాత పాకిస్తాన్ లో బాలీవుడ్ చిత్రాలపై నిషేధం విధించారు. అయితే, పర్వేజ్ ముషారఫ్ పగ్గాలు చేపట్టిన తర్వాత పాక్షికంగా నిషేధం సడలించారు. తదనంతర కాలంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) హయాంలో ఈ ఆంక్షలను దాదాపు ఎత్తివేశారు. దీంతో, ఏటా పాక్ లో బాలీవుడ్ సినిమాలు పదుల సంఖ్యలో విడుదలై నిర్మాతలకు ఓవర్సీస్ కలెక్షన్లు కూడా రాబడుతున్నాయి.

  • Loading...

More Telugu News