: కోర్టుకు హాజరైన చిరంజీవి చిన్న కూతురు


కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కుమార్తె శ్రీజ విడాకుల కోసం ప్రయత్నిస్తోంది. ఆమె కొన్నేళ్ళ క్రితం శిరీష్ భరద్వాజ్ ను ప్రేమ వివాహం చేసుకుంది. ఓ బిడ్డకు జన్మనిచ్చే వరకు వారి దాంపత్యం సజావుగానే సాగినా.. తదనంతర కాలంలో వారి కాపురంలో కలతలు చెలరేగాయి. దీంతో, శ్రీజ పుట్టింటికి చేరింది. అప్పటినుంచి ఆమె తన బిడ్డతో చిరంజీవి నివాసంలోనే ఉంటోంది. ఇక, తామిద్దరి కలయిక అసాధ్యమని భావించిన చిరు తనయ విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఈ క్రమంలో ఆమె నేడు సిటీ సివిల్ కోర్టులోని కుటుంబ వ్యవహారాల న్యాయస్థానానికి హాజరయ్యారు. విచారణ అనంతరం ఈ కేసును ఈనెల 27కు వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. కాగా, కోర్టు వద్ద చిరంజీవి కుమార్తె శ్రీజను చూసేందుకు జనం పెద్ద ఎత్తున గుమిగూడారు. ఇదిలావుంటే, శ్రీజ భర్త శిరీష్ భరద్వాజ్ హైదరాబాద్ నగరంలో బీజేపీ యువనేతగా ప్రాచుర్యం సంపాదిస్తున్నారు. ఆయన ఇటీవలే గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని కలిసి ఆయన ఆశీస్సులందుకున్నారు. భరద్వాజ్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరుపున ఎమ్మెల్యే సీటును ఆశిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News