విజయోత్సవ ర్యాలీలో మంటలు.. పూణేలో గెలిచిన అభ్యర్థికి గాయాలు.. వీడియో ఇదిగో!
- స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి ర్యాలీ
- ఆలయం వద్ద పూజ చేయిస్తుండగా మంటలు
- అభ్యర్థి సహా 16 మందికి గాయాలు
మహారాష్ట్రలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. పూణేలో గెలిచిన ఓ అభ్యర్థి సాయంత్రం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న జేజురి ఆలయం ముందు మద్దతుదారులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆలయం ముందున్న ఖండరేయ భారీ విగ్రహం ముందు పసుపు జల్లగా.. విగ్రహం ముందున్న దీపం నుంచి మంటలు ఎగసిపడ్డాయి.
ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో కౌన్సిలర్ గా ఎన్నికైన అభ్యర్థితో పాటు ఆయన మద్దతుదారులు 16 మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాయపడ్డ వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనలో గాయపడ్డ కౌన్సిలర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారని సమాచారం.