బిగ్ బాస్ సీజన్-9 గ్రాండ్ ఫినాలే ప్రోమో ఇదిగో... విజేత ఎవరు?
- 105 రోజుల పాటు అలరించిన బిగ్ బాస్ సీజన్-9
- విన్నర్ ఎవరో మరికొన్ని గంటల్లో తేలనున్న వైనం
- గ్రాండ్ ఫినాలే ప్రోమో విడుదల చేసిన స్టార్ మా చానల్
మూడు నెలలకు పైగా పాటు తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించిన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-9 నేటితో ముగియనుంది. ఈ రోజు రాత్రి 7 గంటలకు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుంది. హౌస్ లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్లలో విజేత ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. కాగా, గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ పై స్టార్ మా చానల్ ప్రోమో వీడియో విడుదల చేసింది. బిగ్ బాస్ సీజన్-9లో ఇమ్మాన్యుయేల్, కల్యాణ్, డెమోన్ పవన్, తనూజ, సంజన గ్రాండ్ ఫినాలేకు చేరారు.