ఆర్ఎస్ఎస్ ను బీజేపీతో ముడివేయడం పెద్ద పొరపాటు: మోహన్ భగవత్

  • కోల్ కతాలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలు
  • హాజరైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
  • ఆర్ఎస్ఎస్ పట్ల చాలామందిలో అపోహలు ఉన్నాయని వెల్లడి
  • సంఘ్ కు ఎలాంటి రాజకీయ అజెండా లేదని ఉద్ఘాటన
  • హిందూ సమాజ శ్రేయస్సే సంఘ్ లక్ష్యమని స్పష్టీకరణ 
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది వేడుకల సందర్భంగా కోల్ కతాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ సంస్థ అధినేత మోహన్ భగవత్ మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ గురించి చాలామందిలో అపోహలు ఉన్నాయని అన్నారు. ఆర్ఎస్ఎస్ ను బీజేపీతో ముడివేయడం పెద్ద తప్పు అని స్పష్టం చేశారు. బీజేపీలో అనేకమంది నాయకులు ఆర్ఎస్ఎస్ నుంచి వెళ్లినవాళ్లే అని, అంతమాత్రాన ఆర్ఎస్ఎస్ ను బీజేపీతో కలిపి చూడడం పొరపాటు అని అభిప్రాయపడ్డారు. 

సంఘ్ ఎవరి పట్ల విరోధభావంతో పనిచేయదని, హిందూ సమాజ ఐక్యత, సౌహార్ద్రత కోసమే పనిచేస్తుందని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. చాలామందికి ఆర్ఎస్ఎస్ అనే పేరు మాత్రమే తెలుసని, కానీ ఆర్ఎస్ఎస్ ఎలాంటి కార్యకలాపాలు నిర్వర్తిస్తుందో తెలియదని అన్నారు. సంఘ్ అభివృద్ధి చెందడం కొందరికి నచ్చని విషయం అని వ్యాఖ్యానించారు. కేవలం హిందూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే ఆర్ఎస్ఎస్ కు ఎలాంటి రాజకీయ అజెండా లేదని భగవత్ ఉద్ఘాటించారు.


More Telugu News