అర్ధాంగి పుట్టినరోజు సందర్భంగా మంత్రి లోకేశ్ ఎమోషనల్ ట్వీట్
- నారా బ్రహ్మణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్
- స్ఫూర్తివంతమైన మహిళ భార్యగా దొరకడం తన అదృష్టమన్న మంత్రి
- హ్యాపీ బర్త్ డే వదినమ్మా అంటూ లోకేశ్ అభిమానుల పోస్టులు
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ రోజు సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు. తన అర్ధాంగి నారా బ్రహ్మణి పుట్టిన రోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
‘జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులు, చీకటి వెలుగుల్లో, కష్టనష్టాల్లో నేను ధైర్యంగా నిలబడటానికి ఒకే కారణం స్ఫూర్తివంతమైన మహిళ భార్యగా ఉండటమే.. హ్యాపీ బర్త్ డే బ్రహ్మణి’ అంటూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మణితో కలిసి దిగిన ఫొటోను ఆయన ఈ పోస్టుకు జతచేశారు. కాగా, మంత్రి నారా లోకేశ్ అభిమానులు ‘హ్యాపీ బర్త్ డే వదినమ్మా’ అంటూ ఎక్స్ లో పోస్టులు పెడుతున్నారు.