జగన్ పుట్టిన రోజు సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
- ఆరోగ్యంగా, దీర్ఘాయువుతో ఉండాలంటూ సీఎం ట్వీట్
- గవర్నర్, మంత్రి లోకేశ్ కూడా ట్విట్టర్ లో శుభాకాంక్షలు
- తెలుగు రాష్ట్రాల్లో కేక్ కటింగ్, అన్నదానం చేస్తున్న జగన్ అభిమానులు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ‘‘వైఎస్ జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మంచి ఆరోగ్యంతో దీర్ఘాయువు పొందాలని కోరుకుంటున్నా” అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఆయురారోగ్యాలతో జగన్ సుదీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. మంత్రి నారా లోకేశ్ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా జగన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా.. జగన్ పుట్టినరోజు సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రల్లో ఉన్న అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నారు. కేక్ కటింగ్ కార్యక్రమాలు, అన్నదానాలతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.