: సఫారీతో విండీస్ ఢీకి వర్షం అడ్డం


విండీస్, సౌతాఫ్రికా కీలక సమరానికి వరుణుడు అడ్డంకిగా మారాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్కో మ్యాచ్ గెలిచి, ఒక్కో మ్యాచ్ ఓడి, సెమీస్ లో అడుగు పెట్టాలంటే గెలిచి తీరాల్సిన కీలక సమరంలో విండీస్, సౌతాఫ్రికాలు ఒకర్నొకరు ఢీ కోనున్నారు. ఈ గ్రూపు నుంచి టీమిండియా సెమీస్ లో అడుగుపెట్టడంతో రెండో స్థానంలో ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టే సెమీస్ లో అడుగుపెడుతుంది. అటువంటి కీలక సమరానికి వర్షం అడ్డంకిగా మారింది. వర్షం భారీగానే కురుస్తోంది. ఎంత సేపు వర్షం పడ్డా ఔట్ ఫీల్డ్ ను బట్టే మ్యాచ్ జరిగేదీ లేనిదీ అంపైర్లు నిర్ణయిస్తారు.

  • Loading...

More Telugu News