: అరసవెల్లి సూర్యనారాయణ ఆలయంలో తొక్కిసలాట
శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. సూర్యజయంతి కావడంతో స్వామి దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుంచీ వేలాదిగా భక్తులు అరసవెల్లికి చేరుకున్నారు. ఉచిత దర్శనం క్యూలో భక్తులు భారులు తీరి ఉన్నారు. అయితే అనుకోకుండా భక్తుల మధ్య తోపులాట మొదలై తొక్కిసలాటకు దారితీసింది. దీంతో పలువురు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. భక్తుల రద్దీకి తగినట్లుగా ఆలయ సిబ్బంది సరైన ఏర్పాట్లు చేయకపోవడం, జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.
- Loading...
More Telugu News
- Loading...