: వొడాఫోన్ కు వందకోట్ల జరిమానా
బహుళజాతి టెలికాం సంస్థ వొడాఫోన్ కు రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ భారత టెలికాం శాఖ నిర్ణయం తీసుకుంది. 2003-2005 మధ్య కాలంలో ఎస్టీడీ సర్వీసులను లోకల్ సర్వీసులుగా మార్చినందుకే ఈ జరిమానా వడ్దించినట్టు తెలుస్తోంది. గతనెల్లో ఇవే ఆరోపణలపై భారతి ఎయిర్ టెల్ కూ జరిమానా విధించారు. కాగా, వొడాఫోన్ కు ఈ పరిణామం మూలిగే నక్కపై తాటిపండులా పరిణమించనుంది. ఎందుకంటే, ఈ సంస్థ ఇప్పటిదాకా రూ.12 వేల కోట్ల రూపాయలు పన్ను రూపేణా చెల్లించాల్సి ఉందని ఐటీ శాఖ అంటోంది. ఈ నేపథ్యంలో మరో వంద కోట్ల రూపాయల జరిమానా మింగుడుపడని అంశమే.