: ప్రతి మంత్రికీ బెదిరింపులు తప్పవు : మొయిలీ
చమురు దిగుమతి లాబీలు తనను కూడా బెదిరించాయని చమురు, సహజవాయు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. ప్రతి మంత్రికీ ఆ లాబీల నుంచి బెదిరింపులు తప్పవని వ్యాఖ్యానించారు. అయితే బెదిరింపులు ప్రజా జీవితంలో భాగమే కాబట్టి వాటికి భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.