: ఇప్పుడు న్యాయవాదుల వంతు!
ఛలో అసెంబ్లీ ముట్టడికి తెలంగాణా వాదులు దఫదఫాలుగా ప్రయత్నిస్తున్నారు. తెల్లవారు ఝామునుంచే వీరి ప్రయత్నాలు ప్రారంభమైనా, ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకోవడంతో, వీరి అరెస్టులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాజకీయనాయకులు, పలు సంఘాల నేతలు, విద్యార్థుల ప్రయత్నాలను పోలీసులు వమ్ము చేశారు. తాజాగా అసెంబ్లీ ముట్టడికి వెళుతున్న న్యాయవాదులను నాంపల్లిలో అడ్డుకుని అరెస్టు చేసారు.