: తెలంగాణపై సీఎం పగ సాధిస్తున్నారు: కేటీఆర్


తెలంగాణపై సీఎంకి ఎందుకంత పగ? అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు ప్రశ్నిస్తున్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే, సీఎం కిరణ్ తెలంగాణ ప్రజలపై పగ సాధిస్తున్నట్టుగా భావించాల్సి వస్తోందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో ఈ రోజు మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు తన వద్దకు వస్తానంటే, అసెంబ్లీ దొడ్డిదారిన గుండా పారిపోయిన ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News