: కేసీఆర్ ఎంటరయ్యారు!
చలో అసెంబ్లీ కార్యక్రమంపై టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు స్పందించారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ ఉదయం నుంచి చోటు చేసుకున్న పరిణామాలను కేసీఆర్ నిశితంగా పరిశీలించారు. మీడియాతో మాట్లాడుతూ, అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా, రేపు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు.