: తిరువీధులలో ఊరేగుతున్న దేవదేవుడు


సకల ప్రాణులకూ శక్తిని ప్రసాదిస్తూ సృష్టి మనుగడకు తోడ్పడుతున్నాడు సూర్యభగవానుడు. ఈ రోజు రథసప్తమి. భానుడు పుట్టిన రోజు. అంటే ప్రతీ ప్రాణికీ జన్మదినమే. ఈ విశేష పర్వదినం సందర్భంగా రెండు ఆలయాలలో ప్రత్యేక ఉత్సవాలు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి  సూర్యనారాయణ ఆలయం, తిరుమల భక్తులతో నిండిపోయాయి. 

తిరుమలలో ఈ ఉదయం రథసప్తమి వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. శ్రీనివాసుడు ఈ రోజున ఏడు వాహనాలలో ఊరేగనున్నాడు. తొలిగా స్వామి తిరువీధులలో సూర్యప్రభ వాహనంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అనంతరం చిన్నశేషవాహనంలో భక్తులను అనుగ్రహించారు. ప్రస్తుతం స్వామి వారికి గరుడ సేవ వైభవంగా జరుగుతోంది.

 గోవింద నామస్మరణలతో తిరువీధులు మార్మోగుతున్నాయి. సుమారుగా రెండు లక్షలకుపైనే భక్తులు తిరుమలకు విచ్చేశారని అంచనా. ఈ రోజు సూర్యాస్తమయం లోపు స్వామికి మరో నాలుగు వాహన సేవలను నిర్వహించనున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
 
ఇక, అరసవెల్లి సూర్యనారాయణ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ రోజు సూర్యదేవుడి జయంతి కావడం.  అదీ స్వామికి ఇష్టమైన ఆదివారమే ఆ పర్వదినం రావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. అర్ఛక స్వాములు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరి ఉన్నారు. 

  • Loading...

More Telugu News