ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. అజెండా ఖరారు

  • అంతర్జాతీయ ఆర్థిక సదస్సు నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు
  • సదస్సులో వివిధ అంశాలపై 27 ప్రత్యేక సెషన్లు
  • తరలి రానున్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులు
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' అజెండా ఖరారైంది. ఈ అంతర్జాతీయ ఆర్థిక సదస్సు నిర్వహణకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో వివిధ అంశాలపై 27 ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు. దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులు తరలి వస్తారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో వేదికలు సిద్ధమవుతున్నాయి. సదస్సు రెండో రోజు సాయంత్రం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనున్నారు.

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్‌ను ప్రభుత్వం ప్రకటించనుంది. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సెషన్‌లో పీవీ సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపిచంద్, గగన్ నారంగ్, గుత్తా జ్వాల పాల్గొననున్నారు. క్రియేటివ్ సెషన్‌లో రాజమౌళి, రితేష్ దేశ్‌ముఖ్, సుకుమార్, గుణీత్ మోంగా, అనుపమ చోప్రా పాల్గొంటారు.


More Telugu News