: నైతిక విజయం తెలంగాణవాదులదే: కోదండరాం
ప్రభుత్వం, పోలీసులు ఏకమై తెలంగాణ వాదాన్ని అణచివేయాలని భావించినా.. చలో అసెంబ్లీ కార్యక్రమం సఫలమైందని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అశోక్ నగర్ వద్ద పోలీసులు తనను అరెస్టు చేసిన సందర్భంగా అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడుతూ.. నైతిక విజయం తెలంగాణవాదులదే అని ప్రకటించారు. చలో అసెంబ్లీకి అనుమతివ్వకుండా సర్కారు సాధించింది ఏమీ లేదని కోదండరాం ఎద్దేవా చేశారు. ఇక, గ్రామాల్లోకెళ్ళి ప్రజాప్రతినిధులను నిలదీస్తామని హెచ్చరించారు.