: బొత్సపై ఎమ్మెల్యే జోగి వ్యాఖ్యలు వ్యక్తిగతం: కాసు
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని మంత్రి కాసు కృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. కిరణ్ సర్కారును కూల్చేందుకే పీసీసీ అధ్యక్షుడు బొత్స ప్రయత్నిస్తున్నారని జోగి రమేష్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే జోగి రమేష్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని కాసు అన్నారు.