: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బీజేపీ నేతల అరెస్టు


చలో అసెంబ్లీకి జై కొడుతున్న నేతలను అరెస్టు చేసే ప్రక్రియ ముగిసేట్టు కనపించడంలేదు. తాజాగా.. బీజేపీ రాష్ట్ర నేత కిషన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక అశోక్ నగర్ వద్ద బీజేపీ నేతలు విద్యాసాగర్ రావు, లక్ష్మణ్ లతో పాటు కొందరు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, విద్యాసాగర్ రావును అరెస్టు చేసే సమయంలో కార్యకర్తలు అడ్డగించడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జి చేశారు. ఈ సంఘటనలో విద్యాసాగర్ రావుకు గాయమైనట్టు సమాచారం.

  • Loading...

More Telugu News