గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్.. కొత్తగా కార్యకలాపాలు మొదలుపెట్టిన మరో రెండు విదేశీ కంపెనీలు

  • హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన సోనోకో, ఈబీజీ గ్రూప్
  • శాశ్వత భవనంలోకి మారిన సోనోకో ఐటీ పెర్ఫార్మెన్స్‌ హబ్
  • ఫైనాన్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేయనున్న సోనోకో
  • ఈబీజీ పవర్‌హౌస్‌పై రెండేళ్లలో భారీ పెట్టుబడికి ప్రణాళిక
ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలకు గమ్యస్థానంగా మారుతున్న హైదరాబాద్‌లో మరో రెండు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. అమెరికాకు చెందిన సొనోకో ప్రోడక్ట్స్‌, జర్మనీకి చెందిన ఈబీజీ గ్రూప్‌ నగరంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. ఈ పరిణామం హైదరాబాద్ వ్యాపార అనుకూల వాతావరణానికి నిదర్శనంగా నిలుస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో నగరంలో అత్యాధునిక ఐటీ పెర్ఫార్మెన్స్‌ హబ్‌ను ప్రారంభించిన సొనోకో ప్రోడక్ట్స్‌, తాజాగా తమ కార్యకలాపాలను ఒక శాశ్వత భవనంలోకి మార్చింది. దీనితో పాటు, హైదరాబాద్‌లో ‘ఫైనాన్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ)’ ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారి రాజీవ్‌ అంకిరెడ్డిపల్లి వెల్లడించారు.

మరోవైపు వెల్‌నెస్‌, మొబిలిటీ, టెక్నాలజీ, రియల్టీ వంటి బహుళ రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈబీజీ గ్రూప్‌.. హైదరాబాద్‌లోని డల్లాస్‌ సెంటర్‌లో ‘ఈబీజీ పవర్‌హౌస్‌’ను ప్రారంభించింది. ఈ కేంద్రం అభివృద్ధి కోసం రాబోయే రెండేళ్లలో 70 లక్షల డాలర్లు (రూ.6,160 కోట్లు) పెట్టుబడిగా పెట్టనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ సంస్థల రాకతో స్థానికంగా మరిన్ని ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని నిపుణులు భావిస్తున్నారు.


More Telugu News