: ఆకుకూరలతో మధుమేహం దూరం


ఆకుకూరలతో ఆరోగ్యం... ఈ మాట ఎప్పటినుండో ఎందరో చెప్పే ఉంటారు. అయినా కూడా మరోసారి వినాల్సిందే అంటున్నారు తాజా అధ్యయనవేత్తలు. ఆకుకూరలను తినడం వల్ల మధుమేహానికి దూరంగా ఉండవచ్చని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు, ఆకుకూరలే కాకుండా రోజూ పల్లీలు, ఇతర డ్రై ఫ్రూట్స్‌ తీసుకునే వారిలో కూడా మధుమేహంతోబాటు ఇతర గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతిరోజూ పల్లీలు తినేవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం ఇరవైవొక్క శాతం తగ్గుతుందట. డ్రైఫ్రూట్స్‌ శరీరానికి అవసరమైన కొవ్వును అందిస్తూనే బరువును అదుపులో ఉంచుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ఆకుకూరల్లో కెలోరీలు, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ప్రతిరోజూ ఏదో ఒక ఆకుకూర తీసుకొనే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పధ్నాలుగు శాతాన్ని తగ్గించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆహారంలో ఆకుకూరలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా అనారోగ్యానికి దూరంగా వుండచ్చన్నమాట.

  • Loading...

More Telugu News