: మరో 12 ఏళ్లకు మన సంఖ్య 800 కోట్లు


మరో పన్నెండేళ్లకు మన జనసంఖ్య 800 కోట్లకు పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. ప్రతిఏటా జనాభా పెరుగుతోందేగానీ తరుగుదల కనిపించడం లేదు. ఈ నేపధ్యంలో పెరుగుతున్న జనాభాను ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 700 కోట్లు (7.2 బిలియన్లు)కు పైగా ఉందని, ఈ సంఖ్య మరో పన్నెండేళ్లకు అనగా 2025 నాటికి 800 కోట్లు (8.1బిలియన్లు) దాటుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.

ప్రపంచ దేశాలలో ప్రధానంగా ఆఫ్రికా, అభివృద్ధి చెందుతున్న దేశాలైన భారత్‌, ఇండోనేషియా, పాకిస్థాన్‌, ఫిలిప్ఫైన్స్‌, అమెరికా వంటి దేశాల్లో జనాభా పెరుగుదల ఉందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఇలాగే పెరుగుతూ పోతే 2050 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లను దాటుతుందని ఐరాస గురువారం నాడు విడుదల చేసిన ఒక నివేదికలో హెచ్చరించింది.

  • Loading...

More Telugu News