: బుల్లిబైకు వేగం గంటకు 50కి.మీ
తన కుమారుడికి ఒక చిన్న బైకు తయారు చేసిస్తే ఎలా ఉంటుంది? అనుకున్నాడో ఏమో రియాజ్ అనే ఒక వ్యక్తి. అనుకున్నదే తడవుగా ఒక మెకానిక్‌ను సంప్రదించి తన కుమారుడికి అనుగుణంగా ఒక బుల్లి బైక్‌ను తయారు చేయించి ఇచ్చాడు. ఇప్పుడు రయ్యిమంటూ ఆ బుల్లి బైకేసుకుని ఆ బుడతడు తిరిగేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
అనంతపురానికి చెందిన రియాజ్ తన కొడుక్కి ఒక బైకు తయారు చేసి ఇవ్వాలనుకున్నాడు. దీంతో ఒక మెకానిక్‌ను సంప్రదించి ఇంట్లో పాడుబడిన బజాజ్ సన్నీ బైకుకు చెందిన ఇంజను, ఇతర విడి భాగాలను ఉపయోగించి ఒక బైకును తయారు చేశారు. ఈ బుల్లిబైకు గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో వెళుతుందని, ఒక లీటరు పెట్రోలుకు 50 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందని రియాజ్ చెబుతున్నాడు.