: పాకిస్తాన్ లో బాంబు పేలుడులో 69 మంది మృతి
పాకిస్తాన్ లో టెర్రరిస్టులు మళ్ళీ రెచ్చిపోయారు. క్వెట్టా నగరంలో భారీ పేలుడుకు తెగబడ్డారు. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ దుర్ఘటనలో 69 మంది అక్కడికక్కడే మరణించారు. 200 మందికి పైగా గాయాల పాలయ్యారు.
మృతుల్లో మహిళలు, చిన్నారులు అధికంగా వున్నట్టు సమాచారం అందుతోంది. షియా హజారే ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ పేలుడుకు కారకులు ఎవరన్నది ఇంకా వెల్లడి కాలేదు.