: 2100 నాటికి మరింత వేడెక్కుతుంది
ఇప్పటికే వాతావరణంలో మార్పుల కారణంగా భూతాపం పెరిగిపోతోందని ఒకపక్క శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయినా భూతాపాన్ని తగ్గించే దిశగా మనం తీసుకునే చర్యలు తక్కువేనని చెప్పవచ్చు. దీంతో భూమి ఉష్ణోగ్రత పెరిగిపోతోంది. వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాలు సరైన చర్యలు తీసుకోకుంటే 2100 నాటికి భూమి మరో నాలుగు డిగ్రీల సెల్సియస్ మేర వేడెక్కుతుందని ఒక తాజా నివేదిక హెచ్చరిస్తోంది.
ప్రతి శతాబ్దంలోనూ ప్రపంచ ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెల్సియస్‌కన్నా ఎక్కువ పెరగనివ్వకుండా చూడాలని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కమిటీ సూచించింది. అయితే ఈ సూచనలను పాటించాలంటే ప్రస్తుతం అమలులో ఉన్న, ప్రతిపాదనలో ఉన్న విధానాలు సరిపోవని, 2100 నాటికి భూమి మరింత వేడెక్కుతుందని ఈ తాజా అధ్యయనం చెబుతోంది. ప్రస్తుతం వెలువడుతున్న ఉద్గారాలు, వాటిని అదుపులో ఉంచేందుకు అమలులో ఉన్న విధానాల ప్రభావాలను విశ్లేషించిన పరిశోధకులు ఈ విషయాన్ని నిర్ధారించారు. ఈ నివేదికను 'క్లైమేట్ యాక్షన్ ట్రాకర్' రూపొందించింది.