: లక్ష్యాన్ని చేరిన చైనా వ్యోమనౌక
అంతరిక్షంలో చైనా ఏర్పాటు చేయనున్న తియోంగ్గాంగ్-1 స్పేస్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేసే పనిలో భాగంగా మంగళవారం నాడు చైనా అంతరిక్ష పరిశోదనా కేంద్రం నుండి బయలుదేరిన షెంజౌ-10 వ్యోమనౌక కక్ష్యలో తిరుగుతున్న ల్యాబ్‌తో విజయవంతంగా అనుసంధానమయ్యింది. ఈ వ్యోమనౌకలో ఒక మహిళా వ్యోమగామి వాంగ్ యాపింగ్తోబాటు నియ్ షైషెంగ్, జాంగ్ జియావోగువాంగ్లు కూడా ఉన్నారు.
అయితే గతంలో నిర్వహించిన యాత్రల సందర్భంగా ల్యాబ్‌లో పేరుకుపోయిన తేమ, సూక్ష్మజీవుల వల్ల వ్యోమగాముల ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఒకవైపు ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, గురువారం నాడు షెంజౌ-10 వ్యోమనౌక తియోంగ్గాంగ్-1 హ్యాచ్ని తెరచి దానితో అనుసంధానమయ్యింది. తర్వాత వ్యోమగాములు ముగ్గురు కూడా ల్యాబ్‌లోకి ప్రవేశించారు. 2020 నాటికి ఈ స్పేస్‌ల్యాబ్ సేవలు ప్రారంభించాలని చైనా యోచిస్తోంది.